- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం సబ్ కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సౌరబ్ శర్మను శుక్రవారం కాటారం, మల్హర్, పలిమెల, మహముత్తారం మండలాల ఎంపీడీఓలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై సబ్ కలెక్టర్ ఎంపిడీవోలతో చర్చించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సబ్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీడీఓలు బాబు, నిశాంత్, క్రాంతి కుమార్, పవన్ పాల్గొన్నారు.
- Advertisement -



