– సినీ నిర్మాత బండ్ల గణేష్
– మల్కాజిగిరి పార్లమెంటుకు దరఖాస్తు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి సుపరిపాలనకు శ్రీకారం చుట్టారని సినీనిర్మాత బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఆయన మల్కాజిగిరి పార్లమెంటు టిక్కెట్‌ను ఆశిస్తూ… గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ రెండు నెలల రేవంత్ రెడ్డి పరి పాలనపై ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలువబోతున్నదని ధీమావ్యక్తం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి మతిభ్రమించిందని ఆరోపించారు. అందుకే ఆయన సీఎం రేవంత్‌పై ఇష్టమెచ్చినట్టు ఆరోపణలు చేస్తు న్నారని విమర్శించారు. తన విద్యాసంస్థల ద్వారా ఆయన విద్యార్థుల రక్తాన్ని పీల్చిఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా తానేంతో గర్వపడుతున్నట్టు తెలిపారు.