జీవన్‌ధాన్‌ తెలంగాణకు ..

– ‘హయత్‌ ఇంటర్నేషనల్‌ ఎక్సలెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌’ పురస్కారం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మరణించిన వారి అవయవాలను సేకరించి అవయవ మార్పిడికి అసాధారణమైన కృషి చేయడం.. సంబంధిత అధికారుల విజయాలకుగాను అంతర్జాతీయ స్థాయిలో జీవన్‌ధాన్‌ తెలంగాణకు ‘హయత్‌ ఇంటర్నేషనల్‌ ఎక్సలెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌’ పురస్కారం లభించింది. జనవరి 27వ తేదీన హోటల్‌ కాన్రాద్‌ దుబారు మెయిన్‌ హాల్‌లో జరిగిన వార్షిక యూఏఈ ఆర్గాన్‌ డొనేషన్‌, ట్రాన్స్‌ప్లాంట్‌ కాంగ్రెస్‌- 2024 లో జీవన్‌ధాన్‌ తెలంగాణకు ఈ పురస్కారం ప్రధానం చేశారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆర్గాన్‌ డొనేషన్‌, ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ నేషనల్‌ కమిటీ చైర్మెన్‌ డాక్టర్‌ అలీ అబ్దుల్‌ కరీమ్‌ అల్‌ ఒబైద్లీ, మానవుల అవయవాలను విరాళం అండ్‌ మార్పిడిని నియంత్రించే నేషనల్‌ సెంటర్‌, ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఎక్స్‌పర్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పౌలా గోమెజ్‌, యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేతుల మీదుగా ప్రముఖ నిమ్స్‌ నెప్రోలాజిస్ట్‌ అండ్‌ జీవన్‌ధాన్‌ తెలంగాణ ఇన్‌చార్జి ప్రొఫెసర్‌ స్వర్ణలత పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు రావడం పట్ల ప్రొఫెసర్‌ స్వర్ణలతను పంజాగుట్ల నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప, మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ నిమ్మ సత్యనారాయణ, డీన్‌ ఫ్రొఫెసర్‌ లీజా రాజశేఖర్‌, అసోసియేట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ సాయిబాబా, ఎగ్జిక్యూటివ్‌ రిజిస్టర్‌ ప్రొఫెసర్‌ శాంతివీర్‌, వివిధ విభాగాదిపతులు, వైద్యులు అభినందించారు.

Spread the love