నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల తహశీల్దార్ కార్యాలయంలో ఇటీవల నూతన తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన కె.రవికుమార్ ను సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం తహశీల్దార్ కు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ సభ్యులు మాట్లాడుతూ రైతులు,విద్యార్థుల సమస్యలు సకాలంలో పరిష్కారం చేయాలని తహశీల్దార్ ను కోరారు. ఇందుకు తహశీల్దార్ మాట్లాడారు ప్రజలకు,రైతులకు భూ సంబంధించిన ఎలాంటి సమస్యలున్న దళారులను ఆశ్రయించకుండా నేరుగా తహశీల్దార్ కార్యాలయంలో కలవాలన్నారు. ఆర్టీఐ సంబంధించిన ఎలాంటి సమాచారమైన సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మండల ఉపాధ్యక్షుడు చొప్పరి రాజయ్య, కార్యదర్శి బండి సుధాకర్ సభ్యులు కేశారపు సురేందర్, ఇందారపు రాకేష్,ఇందారపు రంజిత్,గుగ్గిళ్ల రాజు కుమార్, అక్కపాక ఓదెలు,ఇందారపు శ్రీనివాస్ పాల్గొన్నారు.