– జడ్పీ చైర్‌పర్సన్ సునీతమహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్
నవతెలంగాణ-శంకర్‌పల్లి
కాంగ్రెస్‌కు రోజురోజుకూ ప్రజాధారణ పెరుగుతోందని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీత మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్ తెలిపారు. శంకర్‌పల్లి మున్సిపల్ కౌన్సిలర్ సంధ్యారాణి అశోక్ కుమార్, మాజీ ఎంపీటీసీ అశోక్‌కుమార్ వారి అను చరులు 150 మంది వరకు సోమవారం కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి సమక్షంలో చేరారు. అనంతరం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీత మహేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు చేవెళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్వహించే అధికారిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. నేడు చేవెళ్లలో ఆరుగ్యారెంటీల్లో భాగంగా రూ.500 లకే సిలిండర్, ఉచిత విద్యుత్ కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించ నున్నారని తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు ఎంతో ఆదరిస్తున్నారని వివరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలు, నాయ కులకు సూచించారు. కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఉదయ మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షులు జనార్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి, కౌన్సిలర్ రాములు, సంతోష్, సీనియర్ నాయకులు ప్రకాష్, ఎజాస్, మోహన్‌రెడ్డి, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, నస్రుద్దీన్ ప్రశాంత్ అస్లా అస్లాం, హుస్సేన్, శ్రీకాంత్ ,శ్రీధర్ గౌడ్, బిసొల్ల మధు, పాల్గొన్నారు.