Tuesday, June 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బెల్లంకొండ మల్హర్ రావు సేవలు గొప్పవి.!

బెల్లంకొండ మల్హర్ రావు సేవలు గొప్పవి.!

- Advertisement -

ఘనంగా 36వ వర్థంతి వేడుకలు
మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు 
నవతెలంగాణ – మల్హర్ రావు
: మావోయిస్టుల చేతిలో హతమైన, మండల మాజీ ఎంపీపీ స్వర్గీయ బెల్లంకొండ మల్హర్ రావు మండలానికి చేసిన సేవలు గొప్పవని మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు అన్నారు. మల్హర్ రావు 36వ వర్థంతి వేడుకలు సోమవారం మండలంలోని కోయ్యుర్ లో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్హర్ రావు విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు విద్యుత్,రోడ్డు తదితర మౌలిక సౌకర్యాలు మొదటిసారిగా తీసుకొచ్చిన గొప్ప చిరస్మరణీయుడని కొనియాడారు.మండల అభివృద్ధి అహర్నిశలు కృషి చేస్తూ కాలిబాటలో నడిసిన గొప్ప నాయకుడన్నారు. ఆయన అడుగు జాడల్లో నేటి యువత ఆదర్శంగా తీసుకొని మండల అభివృద్ధి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ చెప్యాల రామారావు, బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, మహిళ అధ్యక్షులు చెంద్రకల, నాయకులు దేవర్నెని రాజేశ్వర్ రావు, బూడిద మల్లేష్, యాదగిరి రావు, అజ్మీరా సమ్మయ్య, తాజాద్దీన్, పంచిక మల్లేష్ యాదవ్, మంథని సమ్మయ్య, విజయగిరి రాజు, సుగునకర్ రావు, గంటి రమేష్, లచ్చయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -