ఆపదలో ఉన్న వ్యక్తులకు ఆదుకుంటున్న డాక్టర్ విజయ్

నవతెలంగాణ – మద్నూర్
ఆపదలో ఉన్న వ్యక్తులకు ఆదుకున్నోడే దేవుడు అంటారు. అలాంటి వ్యక్తి మన మద్నూర్ మండల కేంద్రంలో ఒకరు ఉన్నాడు అనే చెప్పడానికి ఒకసారి మద్నూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పశు వైద్య డాక్టర్ విజయకుమార్ స్వచ్ఛందంగా ఎన్నో సేవలు అందిస్తూ ప్రజల్లో పేరు ప్రతిష్టలు పొందుతున్నారు. మంచి పనులకైనా ఆపదలో ఉన్న వ్యక్తుల కైనా డాక్టర్ దానధర్మాలతో ఆదుకుంటున్నారు. మున్నూరు కాపు కు చెందిన మోడే శంకర్ తండ్రి భూమయ్య  గ్రామం :తుబ్ధల్  మండలం: బిచ్కుంద అతనికి అమ్మ నాన్న ఎవరు లేరు. అనాధలు ఒక అక్క మాత్రమే ఉంది. వీరికి ఎలాంటి ఆస్తి పస్తులు లేవు. భూమి కానీ ఇల్లు కాని ఏమికూడ లేవు, ఆసుపత్రి ఖర్చులకు  డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో మద్నూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ విజయ్ ముందుకు వచ్చి రూ.20 వేల రూపాయలు పక్షవాతంతో బాధపడే వ్యక్తికి శుక్రవారం నాడు అందజేశారు. అనాధలనే కాకుండా ఎవరైనా గుడి కడుతున్నాం, అన్నదానం చేస్తున్నాం, లేదా అనారోగ్యాలతో బాధపడుతున్న వాటి పట్ల డాక్టర్ దానధర్మాలతో ఆదుకుంటున్నారు పక్షవాతంతో బాధపడుతూ తల్లి తండ్రి లేని అనాధకు డాక్టర్ 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడంతో బిచ్కుంద మండలం మున్నూరు కాపు సంఘం నాయకులు గ్రామస్తులు డాక్టర్ సేవలకు అభినందించారు. కావున మన వాడికి మనం తోచినంత  ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. తల్లి తండ్రి లేని అనాధ పక్షవాతంతో బాధపడే వ్యక్తికి ఆదుకునేవారు ఫోన్ పే గాని గూగుల్ పే గాని చేయడానికి ముందుకు రావాలని ఫోన్ నెంబర్. 9164989315 ఈ నంబర్ కు చేయవలసిందిగా పలువురు విజ్ఞప్తి చేశారు.
Spread the love