పల్లె పల్లెకూ ‘మోడీ కార్యక్రమం’

– భువనగిరి పార్లమెంటు బీజేపీ
– అభ్యర్థి డాక్టర్‌ బూరనర్సయ్య గౌడ్‌
నవతెలంగాణ-మంచాల
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ హ్యాట్రిక్‌ ఖాయం అని 400 సీట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని భువనగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో బీజేపీ మండల అధ్యక్షులు పాండాల జంగయ్య గౌడ్‌ అధ్వ ర్యంలో గడప గడపకు, పల్లె పల్లెకు నరేంద్ర మోడీ కార్యక్రమం నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో విసిగి పోయిన ప్రజలు రెండు పర్యాయాలు బీఅర్‌ ఎస్‌ను గెలిపిస్తే వారు ఏమీ చేయలేదని ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే గెలిచి 3 నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌, బీఅర్‌ఎస్‌తో విసిగి పోయారని బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 12 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు, పల్లె పల్లెకు నరేం ద్ర మోడీ కార్యక్రమం బీజేపీ మండలాధ్యక్షులు పాండాల జంగ య్య గౌడ్‌ అధ్యక్షత నోముల, లింగంపల్లి, తాళ్ళపల్లి గూడ, చిత్తాపూర్‌, తిప్పాయి గూడ, ఆరుట్ల, జపాల, మంచాల గ్రామాల్లో నిర్వహించారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, నాయకులు బోసుపల్లి ప్రతాప్‌, వింజమూరి వెంకట్‌ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ వైస్‌ ఎంపీపీ దన్నే బాషయ్య, ఇబ్రహీంపట్నం మన్సిపాలిటి మాజీ కౌన్సిలర్‌, ప్రస్తుత కో ఆప్షన్‌ సభ్యులు టేకుల రాంరెడ్డి, నాయకులు నారేడ్డి నర్సింహరెడ్డి, చీవిరాల పాండు, మండల ప్రధాన కార్యదర్శులు నూకం రాజు ముదిరాజ్‌, గడ్డం రాజేందర్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు సిద్దన్న గారి వెంకట్‌ రెడ్డి, వివిధ మోర్చల మండలా ధ్యక్షులు బండిరాజు, అనిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పుల్లాటి యాదయ్య, మహిళా మోర్చ నాయకురాలు జయశ్రీ తదితరులు ఉన్నారు.

Spread the love