– నిత్యం లక్షల, కోట్ల రూపాయల్లో ట్రాన్స్‌సెక్షన్ జరిగే బ్యాంకులు
– క్యాషియర్ నిదానంతో ఇబ్బందులు పడుతున్న వైనం
– 70 శాతం పైగా ఖాతాదారులు ఇక్కడ మహిళలే
– కనీస సౌకర్యాలు కల్పించని బ్యాంక్ అధికారులు
– ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 నుంచి 50 మందికే సేవలు
– విసుగు చెందుతూ ప్రయివేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్నఖాతాదారులు
– క్యాషియర్ సమ స్యను పరిష్క రించాలని డిమాండ్
నవతెలంగాణ-శంషాబాద్
ప్రభుత్వ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం ప్రయిట్‌కు మేలు చేస్తున్నది. బ్యాంకు అవసరాల కోసం వచ్చిన ఖాతాదారులకు సకాలంలో సేవలు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు. దీంతో అవార్యంగా ఖాతాదారులు ప్రయివేటు బాట పడుతున్నారు. శంషాబాద్ మండల పరిధిలోని నర్కూ డ కెనరా బ్యాంకు అధికారులు తీవ్రనిర్లక్ష్యం కారణంగా ఖాతా దా రులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10:00కు వచ్చిన ఖాతా దారులు సాయంత్రం వరకు కూడా తమ పని కాకపో వడంతో దీనంగా వెనక్కి వెళ్తున్నారు. మండల పరిధిలోని నర్కూ డ గ్రామంలో కెనరా బ్యాంకు బ్రాంచ్ ఉన్నది. ఈ బ్రాంచ్ కి నర్కూడ గ్రామంతో పాటు చౌదర్ గూడా, సుల్తాన్‌పల్లి, కాచా రం, రాయన్నగూడ, నానాజీపూర్, మల్కారం, రామంజపూర్, కావేలిగూడ, బోటీ గూడ, కేబీ దొడ్డితో పాటు ఇతర గ్రామాల నుం చి ఖాతాదారులు బ్యాంకుకు వస్తుంటారు. రైతు లు డ్వాక్రా గ్రూపు సంఘాల మహిళలు, ప్రభు త్వ ప్రయివేటు ఉద్యోగులు వ్యాపారులు పెద్ద ఎత్తున ప్రతిరోజు 200 పైగా ఖాతాదారులు బ్యాంక్ సేవల కోసం వస్తుంటారు. ప్రధాన కూడలిలో ఉన్న ఈ బ్యాంకులో చాలా రకాల ఖాతాదారులు ఉన్నారు.
క్యాషియర్ నిర్లక్ష్యం
బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు తమ డబ్బులు డ్రా చేయడం లేదా జమ చేయడానికి వస్తే గంటల తరబడి టోకెన్లు ఇచ్చి క్యూ లో నిలబెట్టుతున్నారు. అయితే ఆయన నిదానం కారణంగా 100మందికి టోకెన్లు ఇచ్చినప్పటికీ 50 మందిలోపే పూర్తి చేస్తు న్నారు. ఉదయం 10 గంటల నుంచి నిలబడి సాయంత్రం కూ డా పని కాకపోవడంతో దిగాలుగా వెళ్ళిపోతున్నారు. అత్యవస రం ఉన్నవారి పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది.ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ క్యాషియర్‌కు మేం చెప్పిన వినడం లేదని అంటున్నా రు. ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఆర్టిక లావా దేవీలు పూర్తి చేయడానికి మేనేజర్ సైతం చర్యలు తీసుకోవడం లేదు.
కనీస సౌకర్యాలు నిల్
మహాత్మా గాంధీ చెప్పినట్లుగా వినియోగ దారుడు ప్రధానమైనవాడు. అతనిపైన మనం ఆధారపడి ఉన్నాం. అతడు మన మీద ఆధారపడి లేడు. అతని గౌరవించడం మన బాధ్యత. విని యోగదారునితో సఖ్యతతో మెలిగి సేవలు అం దించాలి అని చెప్పిన మాటకు పూర్తి విరుద్ధంగా బ్యాంకు అధికారులు వ్యవహరిస్తున్నారు. బ్యాంకు లో ఖాతాదారులకు కనీసం తాగునీటి సౌకర్యం లేదు. టాయిలెట్లు లేవు. ఇతర ఏ సదుపాయం బ్యాంకు అధికారులు కల్పించడం లేదు. దూర ప్రాంతం నుంచి వచ్చిన మహిళలు టాయిలెట్ లేక ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్లు ఎక్కడో అక్కడ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ టాయిలెట్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది మహిళలు గ్రా మంలో పరిచయస్తులు, బంధువుల వద్దకు వెళ్లి టాయిలెట్లను ఉపయో గించుకుంటున్నారు. నిత్యం లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగే బ్యాంకులో మాత్రం కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల ఖాతా దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 70 శాతం పైగా ఖాతాదారులు ఇక్కడ మహిళలే ఉన్నారు. వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల కొంతమంది మహిళలు బహిరంగంగానే అధికారులను నిల దీస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని కనీస సౌకర్యాలు కల్పించాలని క్యాషియర్ సమస్యను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తున్నారు.