అధైర్య పడకండి..ఎల్లవేళలా అండగా ఉంటాం: పీఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుషాల్

– మృతుని కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అందజేత
నవతెలంగాణ – మద్నూర్
 ఇటీవల గుండె పోటుతో  మరణించిన ఉపాధ్యాయడు నాగనాథ్ అప్ప సార్ కుటుంబాన్ని పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ ఆయనతోపాటు మద్నూర్ మండలం పీఆర్టియు నాయకులు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా గుండెపోటుతో మరణించిన నాగనాథ్ సార్ పట్ల వారు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని మనోధైర్యాన్ని నింపుతూ అధైర్య పడకండి ఎల్లవేళలా అండగా ఉంటామని పీఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి మృతుని కుటుంబ సభ్యులకు పిల్లలకు తెలియజేశారు. పీఆర్టియు సంఘం తరఫున లక్ష రూపాయల చెక్కును మృతుని కుటుంబ సభ్యులకు పిల్లలకు అందజేశారు. మరణించిన నాకు నాథ్ అప్ప సార్, పి ఆర్ టి యు టీఎస్ ఉపాధ్యాయ సంఘం క్రియాశీల సభ్యులు ఈయన తమ విధులను మద్నూర్ మండలంలోని మేనూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించేవారు. ఆకస్మాత్తుగా గుండెపోటు తో మరణించడం ఆయన మృతి పట్ల ఉపాధ్యాయ సంఘం చింతించింది మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కుశాల్ సార్ వెంట సునీల్ మారుతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love