నవతెలంగాణ – ఆర్మూర్
మండల పరిధిలోని లోని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు ఏసీపీ శ్రీ బాస్వారెడ్డిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించినారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రాంతంలొ విద్యా ప్రమాణాల స్థాయి పెంచాలని, ప్రతీ విద్యార్థికి సమాజ సేవ పట్ల అవగాహన కలిగి ఉండే విధంగా విద్యా బోధన కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భరత్ చంద్ర మల్లయ్య, కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ జిల్లా బాధ్యులు కాంతి గంగారెడ్డి, మానస గణేష్ , విద్య గోపి కృష్ణ, మరియు నలందా ప్రసాద్, శ్రీ మోడల్ స్కూల్ మల్లేష్ గౌడ్, లిల్లీపుట్ రామకృష్ణ , ప్రజ్ఞ వంశీ తదితరు లు పాల్గొన్నారు.