– బండ్లగూడ కమిషనర్ శరత్చంద్ర
నవతెలంగాణ-గండిపేట్
ప్రతీ వర్షపు బొట్టును ఓడిసి పట్టాలని కమిషనర్ శరత్చంద్ర అన్నారు. గురువారం బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటిని ఎద్దడి నివారించేందుకు ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇంకుడు గంతులు లేని వారికి నోటిసులను జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు లేని యువతి, యువకులు ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. కాళీ మందిర్ నుంచి ఉడిపి హౌటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మనేజర్ వేణుగోపాల్‌రెడ్డి, వర్క్ ఇన్స్‌స్పెక్టర్స్ ఆఫరేటర్లు, బిల్ కలెక్టర్లు, శానిటేషన్ సూఫర్ వైజర్లు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.