- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ సన్ ఫార్మా నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా కీర్తి గనోర్కర్ నియమితులయ్యారు. దిలీప్ సంఘ్వీ స్థానంలో సెప్టెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సంఘ్వీ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్‌గా కొనసాగుతారని ఆ కంపెనీ తెలిపింది. ఎంబీఏ, కెమికల్ ఇంజినీర్ అయిన గనోర్కర్ 1996 నుంచి సన్ ఫార్మాలో వివిధ విభాగాల్లో పని చేశారు. నార్త్ అమెరికా విభాగం ప్రెసిడెంట్, సీఈఓ అభరు గాంధీ తప్పుకోనుండటంతో ఆయన స్థానంలో రిచర్డ్ ఆస్క్రాఫ్ట్ బాధ్యతలను స్వీకరించనున్నారు.
- Advertisement -