
– త్రాగునీటి సరఫరా పై ప్రజాభిప్రాయలను తీసుకోవాలి.జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో తాగునీటి ఎద్దడిపై సమ్మర్ యాక్షన్ ప్రకారం పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హల్ లో త్రాగునీటి ఎద్దడి చేపట్టవలసిన నివారణ చర్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో యస్.పి. రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ బి.ఎస్. లత లతో కలసి పాల్గొన్నారు. మే మాసంలో అధిక ఎండ తీవ్రత దృష్ట్యా జిల్లాలో ఎక్కడ కూడా త్రాగునీటి ఎద్దడి కలగకుండా మున్సిపల్, మండల అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిదంగా తహశీల్దార్లు, ఎంపీడీఓ , ఆర్.డబ్ల్యూ.ఎస్. ఏ. ఈ అలాగే పంచాయతీ సెక్రెటరీలు చేపట్టే వివిధ పనుల యొక్క నిధులు మంజూరుకై అధికారుల సంతకాలు ఉండాలని సూచించారు.హుజూర్ నగర్, మేల్లచెర్వు, మట్టం పల్లి మండలాల ప్రత్యేక అధికారులు త్రాగునీటి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సూర్యాపేట పట్టణం లోని 3,4,5 వార్డులలో త్రాగునీటి సమస్య కొంత ఉన్నందున మున్సిపల్ ట్యాంకర్స్ ద్వారా సరఫరా చేయాలని సూచించారు.త్రాగునీటి పై ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. మండల స్పెషల్ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ లను పరిశీలించాలని. సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వర రావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, ఆర్.డి.ఓ వేణు మాధవ్, డి.ఎఫ్.ఓ సతీష్ కుమార్, సి.పి.ఓ కిషన్, డి.ఎఫ్.ఓ రూపెందర్ సింగ్, డి.ఈ. ఓ అశోక్, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు,ఈ డి ఎం గఫ్ఫార్ తదితరులు పాల్గొన్నారు.