గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ఆదర్శం..

– ఆంగ్ల మాధ్యమంలో 100 శాతం ఫలితాలు సాధించిన భీముని గూడెం..
– 10 కి 10 మార్కులు పొందిన పాఠశాల విద్యార్ధిని జ్యోతి చందు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆద్వర్యం లో నిర్వహిస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో వందకు వంద శాతం ఫలితాలు సాధించి,ఈ పాఠశాల విద్యార్ధిని జ్యోతి చందు 10 కి 10 మార్కులు తెచ్చుకున్న ఘనత దక్కడంతో ఉత్తమ పాఠశాలగా గుర్తింపు తెచ్చుకుంది. మండలంలో గిరిజన సంక్షేమ శాఖ ఆద్వర్యంలో ఐటీడీఏ నిధులు తో నిర్వహిస్తున్న గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలు మొత్తం ఆరు ఉన్నవి.సున్నం బట్టి,పెద్దవాగు ప్రాజెక్ట్ పాఠశాలకు లు బాలురు వి కాగా అనంతారం,కావడి గుండ్లు,భీముని గూడెం,అశ్వారావుపేట పాఠశాలలు బాలికల వి. భీముని గూడెం పాఠశాలలో ఈ ఏడాది పదోతరగతి 48 మంది అందరూ ఉత్తీర్ణత సాధించగా,  జ్యోతి చందు అనే విద్యార్ధిని 10 కి 10 జీపీఏ సాధించింది. ఈ ఆరు పాఠశాలలో ఈ పాఠశాల ఫలితాలు పరంగా మొదటి స్థానంలో నిలిచింది. సున్నం బట్టి పాఠశాల 24 మందికి 23 ఉత్తీర్ణత పొంది 95.83 శాతం తో రెండో స్థానంలో ఉంది. అనంతారం బాలికల పాఠశాల 39 మందికి 38 మంది ఉత్తీర్ణత సాధించి 92.31 శాతం తో మూడో స్థానంలో ఉంది. మారుమూల ప్రాంతం అయిన అటవీ ప్రాంతంలో ఉండే కావడి గుండ్ల బాలికల పాఠశాల 12 మందికి 11 ఉత్తమ ఫలితాలు సాధించి 81.87 శాతం తో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం సున్నం బట్టి లో నిర్వహిస్తున్న పెద్దవాగు ప్రాజెక్టు బాలురు పాఠశాల 22 మందికి 20 మంది ఉత్తీర్ణత పొంది 90.81 శాతం తో ఐదో స్థానంలో ఉంది. అశ్వారావుపేట బాలికల పాఠశాలలో 12 మందికి 9 మంది ఉత్తీర్ణత పొంది 75 శాతం తో చివరిన నిలిచింది. ఈ ఫలితాలు ప్రకారం 95.83 శాతం ఉత్తీర్ణత పొందిన సున్నం బట్టి పాఠశాల మండలంలోనే మొదటిది సారిగా ప్రారంభించిన పాఠశాల.ఈ పాఠశాలలోనే చదివిన,అశ్వారావుపేట మొదటి ఎమ్మెల్యే వగ్గెల మిత్ర సేన,ఇదే పాఠశాలలో పని చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన ప్రస్తుతం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కావడం గర్వించదగ్గ విషయం. 75 శాతం ఫలితాలతో చివరి లో నిలిచిన అశ్వారావుపేట బాలికల పాఠశాల నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో ఉండటం మండలంలోనే చివరిగా ఏర్పడిన పాఠశాల కావడం గమనార్హం.
Spread the love