Tuesday, June 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఐ అండ్‌ పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌గా ప్రియాంక

ఐ అండ్‌ పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌గా ప్రియాంక

- Advertisement -

– బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

సమాచార పౌర సంబంధాల స్పెషల్‌ కమిషనర్‌గా సి.హెచ్‌. ప్రియాంక సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు స్పెషల్‌ కమిషనర్‌గా ఉన్న డా. హరీష్‌ను తెలంగాణ జెన్‌కో ఎం.డీగా బదిలీచేసి మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ డిప్యూటీ సెక్రెటరీగా ఉన్న సి.హెచ్‌. ప్రియాంకను సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం సచివాలయంలో డా. హరీష్‌ నుంచి ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ సెక్రెటరీగా, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌తోపాటు తెలంగాణా ఫిలీం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎం.డీగా బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్‌ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ అనంతరం ప్రియాంకకు సమాచార శాఖ, ఫిలీం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా జెన్కో ఎం.డీగా వెళ్లిన డా. హరీష్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. సమాచార శాఖ కార్యక్రమాలు, పనితీరుపై అధికారులతో సమాచార శాఖ కమిషనర్‌ సమీక్షించారు,

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -