అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో  1,59,174 పార్లమెంట్ ఓటర్లు..

– 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 1,55,961 మంది ఓటర్లు..
– 3,213 మంది ఓటర్లు పెరుగుదల..
నవతెలంగాణ – అశ్వారావుపేట
పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల అధికారులు ఓటర్లు తుది జాబితా ప్రకటించారు.ఆ వివరాలు ప్రకారం అశ్వారావుపేట సెగ్మెంట్ లో పార్లమెంట్ ఎన్నికలకు 1,59,174 మంది ఓటర్లు నమోదు అయ్యారు.2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో 1,55,961 మంది ఓటర్లు నమోదు అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు అశ్వారావుపేట నియోజక వర్గంలో 3,213 మంది ఓటర్లు పెరిగారు. అశ్వారావుపేట నియోజక వర్గం ఏర్పడిన నాటి నుండి ఈ నెల లో జరిగే పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ ఎన్నికలకు ఎంతమంది ఓటర్లు నమోదు అయ్యారో తెలుసుకుందాం. నియోజక వర్గాలు పునర్విభజన లో భాగంగా 2009 లో అశ్వారావుపేట నియోజక వర్గం రూపుదిద్దుకుంది. నాడు అశ్వారావుపేట, ములకలపల్లి, దమ్మపేట, కుక్కునూరు, వెలేరుపాడు మండలాలు నియోజక వర్గం లో ఉండేవి. ఈ ఏడాది అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో 1,53,271 మంది ఓటర్లు నమోదు అయ్యారు. 2014 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 1,67,493 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి మొదటి సారి ఎన్నికలు జరిగాయి.ఈ సారి కుక్కునూరు,వెలేరుపాడు మండలాలు ఆంధ్రప్రదేశ్ విలీనం అయ్యాయి. మండలాల పునర్విభజనలో చండ్రుగొండ, అన్నపరెడ్డి పల్లి మండలాలు ఈ నియోజక వర్గంలో చేరాయి. 2018 అసెంబ్లీకి 1,43,960 మంది ఓటర్లు కాగా,2019 పార్లమెంట్ ఎన్నికల్లో 1,50,205 మంది ఓటర్లు ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 1,55,961 మంది ఓటర్లు ఉండగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 1,59,174 నమోదు అయి ఉన్నారు.అసెంబ్లీ ఎన్నికలకు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు 3,213 మంది ఓటర్లు పెరిగారు. ఎంతమంది ఓటు హక్కు వినియోగించు కుంటారో  వేచి చూద్దాం.
Spread the love