
ఓటింగ్ యంత్రాల కమీషనింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.
సోమవారం ఆయన స్థానిక వ్యవసాయ కళాశాలలో చేపడుతున్న అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎం యంత్రాల, వీవీ పేట్ ల కమీషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన 184 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్ యూనిట్ లు,కంట్రోల్ యూనిట్ లు, వీవీ పేట్ ల కమీషనింగ్ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. బ్యాలెట్ యూనిట్ల పొందిక లో జాగ్రత్తలు వహించాలని,సీలింగు లు వేసే ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. అనంతరం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ పెసిలిటేషన్ సెంటర్ ను ఆయన తనిఖీ చేశారు.పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి నిర్వహిస్తున్న రిజిస్టర్ లు పరిశీలించారు.పోలింగ్ ప్రక్రియ చేపడుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు.ఇంతవరకు ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు అని అడిగి తెలుసుకున్నారు.భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, అశ్వారావుపేట తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, అధికారులు తదితరులు ఉన్నారు.