మోటార్ బైక్ ర్యాలీ విజయవంతం చేయాలి..

– ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించ రాదు.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఓటు హక్కు వినియోగించుకోవడం ఒక సామాజిక బాధ్యత భావించాలని ఓటర్ల అవగాహన కొరకు బుధవారం ఉదయం 8 గంటలకు సూర్యాపేట పట్టణంలోని మెడికల్ కాలేజీ వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు మోటార్ బైక్ ర్యాలీని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం వెబెక్స్  ద్వారా జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. స్విప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లలలో చైతన్యం తీసుకురావడానికి బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు వినియోగించుకోవాలని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం మన బాధ్యతని తెలియజేయుట కొరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని కలెక్టర్ అన్నారు.స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీని ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
Spread the love