విద్యతోనే  ప్రగతి: జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావ్

– విద్యాబోధనలో గుణాత్మక మార్పులు తెచ్చాం
నవతెలంగాణ  – సూర్యాపేట కలెక్టరేట్
విద్యతోనే  ప్రగతని విద్యార్థులకు గుణాత్మకమైన విద్యానందించి జిల్లాలో మంచి ఫలితాలు సాధించామని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. గురువారం కలెక్టరేట్  సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో పదో తరగతి ఫలితాల్లో 10/10 జి.పి.ఏ సాధించిన ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.  ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో పదిలో ప్రత్యేక తరగతులు చేపట్టి నాణ్యమైన విద్యానందించామని, పది పరీక్షలు పకడ్బందీగా చేపట్టామని అన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత పొందాలన్నదే లక్ష్యం కాగా ఆదిశగా ముందస్తు ప్రణాళికతో విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ముఖ్యంగా మండల స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులను నియమించి అన్ని పాఠశాలల్లో విద్యాబోధన విధానాన్ని మరింత మెరుగు పరిచామని అన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించడం జరిగిందని,  పది ఉత్తీర్ణత విద్యార్థులు తొలి మెట్టు గా గుర్తు పెట్టుకోవాలని అన్నారు. జిల్లాలో   354 మంది విద్యార్థులు 10 /10 జి.పి.ఏ సాధించడం అంటే సాధారణ విషయం కాదని  ప్రభుత్వ పాఠశాలలో మున్ముందు ఇదే తరహాలో ఉత్తీర్ణత శాతం సాధించాలంటే ఉపాధ్యాయులు  సమిష్టి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 6 వ స్థానాల్లో నిలిచిందని మున్ముందు రోజుల్లో మొదటి స్థానంలో నిలిచేలా విద్యార్థులకు గుణాత్మక విద్యానందించాలని సూచించారు. జిల్లాలో విద్యార్థులకు మెరుగైన విద్య కోసం 480  కేంద్రాల్లో   ఇన్స్పెక్షన్ చేయించాలని  విద్యార్థులు మొదటి, రెండో స్థానాలకు చేరుకున్నారని వివరించారు. నేను కూడా గ్రామీణ ప్రాంతం రైతు కుటుంబం నుండి రావడం జరిగిందని  ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో విద్యాబోధన జరిగిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. సూర్యాపేట డివిజన్ పరిధిలో మంచి మార్కులు సాధించిన 193 మంది విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో మెమోంటో, శాలువలతో ఘనంగా సన్మానించారు. తదుపరి  ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన విద్యాశాఖ అధికారి అశోక్ కు ఈ సందర్బంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో  ఏ. డి. శైలజా, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love