- Advertisement -
- కాటారం డిఎస్పీ సూర్యనారాయణ
నవతెలంగాణ-మల్హర్రావు(కాటారం) మైనర్లకు వాహనాలు ఇచ్చి నడిపిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని కాటారం డీఎస్సి సూర్యనారాయణ హెచ్చరించారు. కాటారం మండలంలోని మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బస్వాపూర్ గ్రామానికి చెందిన మైనర్ బాలుడుతో ట్రాక్టర్ యజమాని వెన్నపురెడ్డి సమ్మయ్య ట్రాక్టర్‌తో పనిచేయిస్తుండగా యజమాని, ట్రాక్టర్ పై మంగళవారం కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.మైనర్లతో పనులు చేస్తే బాల కార్మిక చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి నడిపించిన పని చేయించిన సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
- Advertisement -