నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
2024-25వ విద్యా సంవత్సరం కు కార్పోరేట్ కళాశాలల యందు ప్రవేశము పొందుటకు మార్చి -2024 పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్దిని /విద్యార్దులు ఈ నెల 15 నుండి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తునట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి కె.జగదీశ్వ ర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన మైనారిటీ విద్యార్దులుhttps://telanganaepass.cgg.gov.in అంతర్జాలం ద్వారా సంబందిత ధ్రువ పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.