– ఎలోర్డా బాక్సింగ్ టోర్నమెంట్
అస్తానా: ఎలోర్డా బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్కు నాలుగు కాంస్య పతకాలు దక్కాయి. పురుషుల విభాగంలో నలుగురు బాక్సర్లు సెమీఫైనల్లోనే నిష్క్రమించారు. సోయిబం సింగ్ (48 కేజీలు), అభిషేక్ (67 కేజీలు) సెమీస్లో 3-4తో పోరాడి ఓడారు. విశాల్ (86 కేజీలు) 0-5తో పరాజయం పాలవగా..గౌరవ్ (92 కేజీలు) సైతం 0-5తో ఓటమి చెందాడు. ఈ నలుగురు సెమీఫైనల్ ఓటమితో కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. నేడు మహిళల విభాగంలో నిఖత్ జరీన్, మీనాక్షి, అనామిక, మనీశలు పసిడి పోరులో పంచ్ విసరనున్నారు.