
యాదాద్రి భువనగిరి జిల్లాలో 108 అంబులెన్సులో అత్యవసర సేవలందించడానికి ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్) పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు యాదాద్రీ భువనగిరి జిల్లా మేనేజర్ శివరాం ప్రోగ్రాం మేనేజరు నసీరుద్దీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ) ఉద్యో గానికి సైన్స్ గ్రూపులో డిగ్రీ (డిప్లొమా ఇన్ ఈఎంటీ, బీఎస్సీ(బైపిసి), పదవ తరగతి పూర్తి చేసి ఏ ఎన్ ఎం, జి ఎన్ ఎం చేసినవారు, పదవ తరగతి పూర్తి చేసి ఎం ఎల్ టి, డి ఎం ఎల్ టి ల్యాబ్ టెక్నీషియన్ చేసి ఉండి 30 సంవత్సరాలలోపు ఉన్న వారు అర్హులన్నారు. ఎం పికైన వారికి ట్రైనింగ్ (శిక్ష ణ కాలం) 45 రోజులు ఉంటుందన్నారు. అనంతరం హైదరాబాద్ లో మూడు నెలలు పనిచేయాల్సి ఉంటుందన్నారు.108 అంబులెన్స్ లో డ్రైవర్గా పనిచేయుటకు పదవ తరగతి పాసై ఉండి డ్రైవింగ్ లైసెన్స్ బ్యాడ్జ్ నెంబర్ వచ్చి ఉండాలి యాదాద్రి జిల్లాలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈనెల 20వ తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు భువనగిరి జిల్లా ఆస్పత్రి 108 కార్యాలయంలో అర్హులైన అభ్యర్థి తమ ఒరిజినల్ సర్టిఫికెట్తో జిరాక్స్ సేటులతో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు 9154865040 ,9985457070నంబర్లో సంప్రదించాలని సూచించారు.