జిల్లాస్థాయి సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతులు విజయవంతం చేయండి: ముషం రమేష్

నవతెలంగాణ – వేములవాడ
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఐ(ఎం) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణాతరగతులు జూన్ 8, 9, 10 తేదీలలో  వేములవాడ పట్టణంలో జరుగుతాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి  ముషం రమేష్ తెలిపారు. శనివారం వేములవాడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లా నలుమూలల నుండి ఎంపికచేయబడిన100మంది ముఖ్య నాయకులు ఈ తరగతులలో తర్ఫీదుపొందుతారు. రాష్ట్ర పార్టీ నాయకులు శిక్షణా ఇస్తారు, ఈ తరగతులను సీపీఐ(ఎం) పార్టీ నాయకులు, కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు హాజరవుతారని తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ..రాజన్న సిరిసిల్ల జిల్లాలో  సీపీఐ(ఎం) పార్టీ కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తున్నది అని అన్నారు. మన జిల్లాలో  వీర్నపల్లి ,గర్జనపల్లి, మరిమడ్ల,చందుర్తి గ్రామాల్లో రైతులు సాగు చేసుకున్న పోడు భూములకు హక్కు పత్రాల కోసం పోరాటాలు చేశారు. రామోజీపేట, ఇల్లంతకుంట అల్మాస్పూర్, గ్రామాల్లోని దళితులపై అగ్రవర్ణాల చేసిన దాడులకు వ్యతిరేకంగా అందర్నీ ఐక్యం చేసి కేసులకు సైతం భయపడకుండా ఉద్యమాన్ని చేశారని అన్నారు.  సిరిసిల్ల,ఇల్లంతకుంట లో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్  రూమ్ కోసం పోరాటం చేసిన ఫలితంగా వందలాది మందికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లబ్ధి పొందారు. పవర్ లూమ్  గ్రామపంచాయతీ మున్సిపల్, ఆశ అంగన్వాడి, హమాలి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నామని వెల్లడించారు. జిల్లాలో పేదల సమస్యల పరిష్కారం కానీ సమస్యలు చాలా ఉన్నవి. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరిన్ని పోరాటాలు నిర్వహించేందుకు కార్యకర్తలకు తర్ఫీదునిస్తున్నాము.వేములవాడ పట్టణంలో మూడు రోజులపాటుసీపీఐ(ఎం) కార్యకర్తల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని కావునా  పార్టీ నాయకులు అందరూ పాల్గొని రాజకీయ శిక్షణ తరగతులను ఉపయోగించుకొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎరవెళ్లి నాగరాజు ,ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, మల్లారపు ప్రశాంత్ ,గురిజాల శ్రీధర్ నాయకులు గణేష్, అశోక్, వేణు  తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love