దరఖాస్తులకు ఆహ్వానం..

నవతెలంగాణ  – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ పథకము కింద సూర్యాపేట జిల్లాకు (31) సీట్లు మంజూరు చేయడం జరిగిందని  జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె. శంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పథకం లో 3వ తరగతికి (16) సీట్లు, 5వ తరగతికి (08) సీట్లు, 8వ తరగతికి (07) సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.జిల్లాలోని గిరిజన తెగలకు చెందిన లంబాడ, ఎరుకల విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.దరఖాస్తు చివరి తేదీ 06.06.2024 లో చేసుకోవాలి అని తెలిపారు.దరఖాస్తు ఫారంలు ఈ నెల 21నుంచి 06 జూన్ వరకు జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయము, రూమ్ నెంబర్.ఎఫ్-5, మొదటి అంతస్థు లో ఉచితంగా పొందగలరు.దరఖాస్తు చేసుకొనుటకు కావలసిన ధ్రువీకరణ పత్రాలు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల యొక్క బోనఫైడ్, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము అలాగే పాస్ ఫోటో జతపరచాలన్నారు. గిరిజన విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Spread the love