స్కూల్ యూనిఫామ్ ఇచ్చే కేంద్రాన్ని పరిశీలించిన డిఆర్డిఓ

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నంలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ ఇచ్చే కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించిన డిఆర్డిఓ శ్రీధర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్కూల్ యూనిఫామ్ విద్యార్థులకు ఇచ్చే విధంగా టెండర్ల వద్ద నుంచి వచ్చాకనే ఉపాధ్యాయులు పంపిణీ చేసేవారు. ప్రభుత్వం నుంచి నేరుగా డిఆర్డిఏ కు  సంస్థకు అందజేయడం,జరుగుతుందని జూన్ 5 వరకు విద్యార్థులకు అందించాలని ఆయన.  ఆదేశించారు.మండలంలో స్వశక్తి మహిళా సంఘాల మహిళలకు ఆర్థికంగా ఉపయోగపడేలా ప్రభుత్వం మహిళలకు పని కల్పిస్తుందన్నారు.ఐకెపి ద్వారా  విద్యార్థుల దుస్తులను కుట్టించి ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డి ఆర్ డి ఏ సంస్థ ద్వారా అందిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నల్ల శ్రీవాణి, ఏపీవో శారద, ఏపీఎం సుధాకర్,  సంపత్,లక్ష్మీనారాయణ,తదితరులు పాల్గొన్నారు.
Spread the love