మేడే ను జయప్రదం చేయండి: సమ్మయ్య

నవతెలంగాణ – శంకరపట్నం
కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోడీ కార్మిక చట్టాల పునరుద్ధరణకై బీజేపీని ఓడిద్దాం,138 మే-డెను జయప్రదం చేయాలని శనివారం ఏఐటియుసి జిల్లాకార్యదర్శి పిట్టల సమ్మయ్య, ఏఐటియుసి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం  కార్మిక, కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, కార్పొరేటర్లకు  ఎన్నో త్యాగాలు,పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని,కార్మిక చట్టాల పునరుద్ధరణకై దేశంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా నగరం హే మార్కెట్లో 1886 మే 1న సమ్మె చేయాలని నిర్ణయించిన ప్రపంచ కార్మికుల సమైక్య సోషలిస్టు మరియు కార్మిక సంఘాల సమ్మె హే మార్కెట్లో భారీ నిరసన ప్రదర్శన ఎనిమిది గంటల పరిధినంకై కదం తొక్కిన కార్మికులు పెట్టుబడిదారులు,వారి గుండాలు,పోలీసులు జరిపిన తుపాకుల కాలుపులో చనిపోయిన వారి రక్తం తలసి ఎగిరిసిన ఎర్రజెండే మేడే  అని అన్నారు.
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పౌర ప్రజాసౌమ్య పాలన అంతమైందని పెట్టుబడిదారీ విధానం కొనసాగుతుందని కార్మిక వర్గం దిశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు 29 చట్టాలను సమూలంగా రద్దుచేసి పెట్టుబడుదాలకు అనుకూలంగా నాలుగు కోడ్ లను తెచ్చిందని అన్నారు. పెన్షన్ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై హమాలి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఎగుమతి-దిగుమతి రేట్లు క్వింటాలకురూ.40/-పెంచాలని,హమాలి,ఆటో,ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని తేవాలని,భవన నిర్మాణ కార్మికుల మరణానికి 10 లక్షల చెల్లించాలని ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని,సింగరేణి కాంటాక్ట్ కార్మికులను ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను పర్మనెంట్ చేయాలని సింగరేణిలో గుర్తింపు పత్రం ఇవ్వాలని,ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగుల సిసిఎస్ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి,ఆశ,మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.26,000 కనీస వేతనం చెల్లించాలని తగ్గించాలని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని బ్యాంకులను కుదించారదని, గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ విధానాన్ని సవరించి పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని,అన్ని రకాల కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని,ఉపాధి హామీ కార్మికులకు 200 రోజుల పని దినాలు కల్పించి రోజుకు రూ.600 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు జిల్లాలోని కార్మికులు కర్షకులు అందరూ మేడే ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ  మండల సహాయ కార్యదర్శి కన్నం సదానందం, ఉపాధ్యక్షుడు తాడవేని రవి, దొమ్మేటి వెంకటస్వామి, బొజ్జ సంపత్, మేకల రవి చిట్యాల బిక్షపతి, ఏం డి ఆలీ, పెయింటర్ సంఘం వెంకన్న, ఆటో యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love