
ఏర్గట్ల మండలకేంద్రానికి చెందిన 2001-2002 లో పదవ తరగతి చదవిన పూర్వ విద్యార్థులు అంతా ఒకేచోట చేరి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు.తమకు చదువు చెప్పిన గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ…విద్యార్థులు వివిధ ప్రదేశాల్లో, వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడి, ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం విద్యార్థులు వారు చదవుకునే రోజుల్లో వారి అనుభవాలను తోటి విద్యార్థులతో,గురువులతో పంచుకున్నారు.