పీహెచ్ సీ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం

నవతెలంగాణ – ఏర్గట్ల
మండలకేంద్రంలోని పి.హెచ్.సి ఆధ్వర్యంలో ఏప్రిల్ 25 సందర్భంగా ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరిపారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ ప్రసన్న ప్రియ మాట్లాడుతూ…మనిషి దోమకాటుకు గురికావడం వల్ల, మలేరియా,బోధకాలు,మెదడు వాపు,డెంగ్యూ,చికెన్ గున్య మొదలైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, ఇలాంటి రోగాలు రాకూడదంటే దోమ కుట్ట కుండ, పుట్టకుండా ఉండాలని అన్నారు. దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండకూడదంటే మనం నివసిస్తున్న పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.దోమల వల్ల వ్యాధి బారిన పడ్డాం అనిపిస్తే ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలని కోరారు .ఇందులోభాగంగా సూపరెండెట్ ఆకుల మారుతి,హెల్త్ అసిస్టెంట్ పండరీ, ఏ.ఎన్.ఎం లు,ఆశాలు పాల్గొన్నారు.
Spread the love