ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం: జీవన్ రెడ్డి

– క్వింటాల్ వరి ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ ఇస్తాం

– రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇప్పిస్తాం
 – కాంగ్రేస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి
నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నిజామాబాద్ కాంగ్రేస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కాంగ్రేస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ… ఏర్గట్ల ప్రాంతంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని,2006 లో వైఎస్ హయాంలో నేను ఆర్.అండ్.బి మంత్రిని అయినప్పుడు తొలి సంతకం గుమ్మిర్యాల్ బ్రిడ్జి నిర్మాణం కోసమే పెట్టానని అన్నారు. ఉచిత కరెంట్ కాంగ్రేస్ పార్టీతోనే సాధ్యం అయ్యిందని,కాంగ్రేస్ పార్టీ రైతుల పక్షపాతి అని అన్నారు. ఆగస్టు 15 లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ,క్వింటాల్ వరికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇప్పిస్తాం అని అన్నారు. బీజేపీ పార్టీ రైతులకు అప్పులు మాఫీ చేయకపోగా,కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే అప్పులు మాఫీ చేసిందని దుయ్యబట్టారు.రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు విద్యుత్ కు అర్హత పొందని లబ్దిదారులు కరెంట్ బిల్లు చెల్లించవలసిన అవసరం లేదని అన్నారు. అర్హత ఉన్న వారికి కచ్చితంగా రేషన్ కార్డు ఇప్పిస్తాం అని, దాని పూర్తి బాధ్యతను బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ సునీల్ రెడ్డి తీసుకుంటాడని ప్రజలకు తెలిపారు.ఆరు గ్యారంటీలు కచ్చితంగా అందరికి అమలయ్యేలా చూస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్,కాంగ్రేస్ పార్టీ మండలాధ్యక్షులు సోమ దేవరెడ్డి,బాల్కొండ బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు ఆడేం గంగాప్రసాద్, రైతు నాయకులు అన్వేష్ రెడ్డి,కిసాన్ ఖేత్ మండలాధ్యక్షులు ముస్కు మోహన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Spread the love