పెండ్లిలో సాంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియన్ యువతి

నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రానికి చెందిన కాంగ్రేస్ పార్టీ డెలిగేట్ గడ్డం జీవన్ రెడ్డి కొడుకు అరుణ్ రెడ్డి,కోడలు శ్రీనందన రెడ్డి వివాహానికి వరుడి స్నేహితురాలైన ఆస్ట్రేలియన్ యువతి సియా హాజరయ్యారు. హిందూ సాంప్రదాయ దుస్తువులు ధరించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణ వాతావరణం,ఆచార,సాంప్రదాయాలు,నాకు ఎంతగానో నచ్చాయని,ఇక్కడి ప్రజలు నాకు ఇస్తున్న గౌరవానికి కృతజ్ఞతలు అని సియా అన్నారు.
Spread the love