
భువనగిరి మండలంలోని ముస్త్యాల పల్లి గ్రామంలో వార్డ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆశ్రమ్ హెడ్ ఆప్ సంస్థ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కంటి పరీక్షలు అవసరమైన వారికి కండ్ల అద్దాలు అందజేశారు. గుండె పరీక్షలు, ఈసీజీ, రక్తము , మూత్రము, షుగర్, బీపీ పండ్లు అన్ని పరీక్షలకు మందులు సిరప్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ చంద్రయ్య యాదవ్, మాజీ ఉపసర్పంచ్ వడ్డే బిక్షపతి , మాజీ సర్పంచ్ గంధ మల్ల హేలేందర్ , గంధ మల్ల జానకిరామ్, వడ్డేమాన్ బిక్షపతి, వడ్డేమాన్ రాములు, రావుల మల్లేష్, ఆశ్రయం సంస్థ డైరెక్టర్ జయరాజు, డాక్టర్ జయంత్, డాక్టర్ సంధ్యారాణి, వర్డ్స్ సొసైటీ డైరెక్టర్ కళ్లెం లక్ష్మీ నరసయ్య , డానియల్ , యువకులు కళ్లెం రాజు, కళ్లెం రత్నం, కళ్లెం సామ్సన్ , కళ్ళెం సొలమోను, గంటపాక రామ్ చరణ్ లు పాల్గొన్నారు.