
నవతెలంగాణ – శంకరపట్నం
ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతతో ఉక్కిరిబిక్కిరైనా జనాలకు ఉపశమనంగా మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో కురిసిన వర్షం చిరు జల్లులతో మండల ప్రజలకు సేద తీర్చింది. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతతో ఉక్కిరి బిక్కిరైనా మండల ప్రజలు చల్లని వాతావరణం తో ఉపశమనం పొందుతున్నారు. మండలంలో అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లులు కురిసి వాతావరణం అంతా చల్లగా మారింది. ఇప్పటివరకు వేసవి స్థాపంతో ఉక్కిరిబిక్కిరి అయిన మండల ప్రజలు ఇప్పుడు కురుస్తున్న వర్షం జల్లులతో సేద తీర్చుకుంటున్నారు. మండలంలో వర్షం కురవడంతో రైతులు వ్యవసాయం చేసుకొనుటకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు ఈ వర్షంతో ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.