Sunday, June 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెంజల్ మండలంలో వివిధ పాఠశాలల్లో ప్రపంచ యోగ దినోత్సవం వేడుకలు

రెంజల్ మండలంలో వివిధ పాఠశాలల్లో ప్రపంచ యోగ దినోత్సవం వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-రెంజల్ 
రెంజల్ మండలంలోని దూపల్లి, ఆదర్శ పాఠశాల, లో శనివారం ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగాసనాలను వేశారు. దూపల్లి పాఠశాలలో ఆర్య సమాజ్ నిజామాబాద్ కు చెందిన శాంత కుమారి, శారద, హారికలు విద్యార్థులకు యోగాసనాల యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు, యోగాసనా లని వేసినట్లయితే విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి వెంకటలక్ష్మి, ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫెరోజ్ హైదర్, పి ఆర్ టి య మండల అధ్యక్షులు టి సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు కృష్ణ, ప్రభాకర్, సాయన్న, రాజేశ్వర్, రాధా, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు పురుషోత్తం, శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -