నవతెలంగాణ – అమరావతి: నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త పోట్లూరి జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తాము రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని తెలిపారు. తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేటర్ గా అవకాశం ఇచ్చి రాజకీయాల్లో ప్రోత్సహించారని వివరించారు.