
విదేశీ పర్యటన ముగించుకుని తొలిసారిగా మంథని నియోజవర్గానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మంగళవారం భూపాలపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంథని నియోజవర్గానికి కొకకోలా కపెనీ తీసుకొచ్చే ప్రయత్నం మంత్రి శ్రీదర్ బాబు చేయడంపై హర్షం వ్యక్తం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ రావడం వలన ఈ ప్రాంతంలోని వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు పాల్గొన్నారు.