– బెంగాల్ గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహిళా ఉద్యోగి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి ఆనంద్ బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రాజ్‌భవన్ మహిళా ఉద్యోగి.. తన కేసులో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆర్టికల్ 32 ప్రకారం ఈ కేసులో న్యాయస్థానం తన అసాధారణ అధికార పరిధిని అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. రాజ్యాంగం గవర్నర్‌కు రాజ్యాంగపరమైన మినహాయింపు ఇవ్వబడినందున ఎటువంటి పరిష్కారం లేకుండా పోవటంతో తాను తన పిటిషన్‌ను దాఖలు చేసినట్టు మహిళ తెలిపింది. అటువంటి మినహాయింపు(ఇమ్యూనిటీ) సంపూర్ణంగా ఉండదని చెప్పటం, గవర్నర్ కార్యాలయం అనుభవిస్తున్న ఈ ఇమ్యూనిటీ మేరకు మార్గదర్శకాలు, అర్హతలను రూపొందించాలని కూడా సదరు మహిళ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.