గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం– మోడల్‌ నియోజకవర్గంగా మధిరను తీర్చిదిద్దా
– పలు గ్రామాల్లో రూ 4 కోట్ల 40 లక్షల
– లింకు రహదారుల నూతన బీటీ రోడ్ల
– నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ-ముదిగొండ
గ్రామాల అభివద్ధి ప్రభుత్వ ధ్యేయమని, మధిర నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని వల్లాపురం, గంధసిరి, అమ్మపేట (వెలగొండస్వామి దేవాలయం వరకు) బాణాపురం, పెద్దమండవ, మల్లారం, వల్లభి గ్రామాలలో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 4 కోట్ల,40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించే బీటీ రహదారులకు ఆయన లాంఛనీయంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు అమలు చేశామని, మరో రెండు గ్యారెంటీలలో రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు రైతులకు ఏకకాలంలో రూ 2 లక్షల మాఫీ చేస్తామన్నారు. మహిళల ఖాతాల్లో నెలకు రూ.2500 జమ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు. స్వయం సహాయక గ్రూపు మహిళలకు పాడి పరిశ్రమతో, తోడ్పాటు అందిస్తూ మధిరలో ఇందిర డైరీ ఫామ్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మధిర నియోజకవర్గ సమగ్ర అభివద్దే తమ లక్ష్యమన్నారు.ప్రజల ఎన్నుకున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రభుత్వమే, రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. రామన్న రోజుల్లో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇండ్లు మంజూరుతోపాటు, రేషన్‌ కార్డులను అందజేస్తామని తెలిపారు. వల్లాపురం, గంధసిరి వెళ్లే రహదారిలో పొలాలలో ఉన్న సన్నకారు రైతుతో భట్టి మాట్లాడారు. మొక్కజొన్న కంకులు విక్రయించే ఆమెతో ఆయన ముచ్చటించారు. మొక్కజొన్న కంకులు తమ సిబ్బందికి కొనిచ్చారు. ఆయా గ్రామాల్లో పలు సమస్యలపై భట్టికి గ్రామస్తులు వినతపత్రాలు అందజేశారు. గంధసిరి గ్రామంలో ఆయన చిన్నారులను ఎత్తుకొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ముజామిల్‌ ఖాన్‌, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కోడె నాగేశ్వరరావు కుటుంబాన్నికి భట్టి పరామర్శ
మండలపరిధిలో పెద్దమండవ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ జిల్లా నాయకులు కోడె నాగేశ్వరరావు నివాసాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం సందర్శించే పరామర్శించారు.కోడె నాగేశ్వరరావుతో మాట్లాడి మాతమూర్తి కోడె భద్రమ్మ మతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవలకాలంలో నాగేశ్వరరావు తల్లి కోడె భద్రమ్మ అనారోగ్యంతో మతి చెందిన విషయము విధితమే. ఈ కార్యక్రమంలో ముదిగొండ సొసైటీ చైర్మెన్‌ తుపాకుల యలకొండస్వామి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్‌ బాబు, ప్రధానకార్యదర్శి పందిరి అంజయ్య, నాయకులు పిల్లుట్ల రాఘవ, ఎంపీటీసీ సభ్యులు బిచ్చాల బిక్షం, సిహెచ్‌ శివ, తాటికొండ రమేష్‌, మట్టా రవీందర్‌రెడ్డి, ఆవుల లక్ష్మారెడ్డి, పరసగాని తిరుపతిరావు, వడ్డేల్లి వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love