భయపెడుతున్న బడి..

భయపెడుతున్న బడి..– శిథిలావస్థలో బంగ్రంపల్లి ప్రాథమిక పాఠశాల
– నీరు కారుతున్న గోడలు
– పాచిపట్టి అధ్వానంగా మారిన పాఠశాల భవనం
– వర్షం వస్తే నిలిచిపోతున్న బోధన
– భయాందోళనలో విద్యార్థులు,తల్లిదండ్రులు
– పాఠశాల ముందే మురుగు నీరు నిల్వ
– పట్టించుకోని విద్యాశాఖాధికారులు
– పాఠశాల ముందే మురుగు నీరు నిల్వ
వర్షం పడితే వర్షపు నీరు కొన్ని రోజుల పాటు పాఠశాల ముందే నిల్వ ఉంటుంది. మురుగు నీటి వలన విద్యార్థులు అనారోగ్య పలావుతున్నారని గ్రామస్తులు తెలిపారు.
పాఠశాల గోడలు పెచ్చులుడుతుడటం, పై కప్పుల నుంచి నీరు కారుతుండటం, గోడలు పాచిపట్టి ఆధ్వానంగా మారడం, వర్షం వస్తే బోధన నిలిచిపోవడం ఈ ఘటనలతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
నవతెలంగాణ-కుల్కచర్ల/చౌడాపూర్‌
మండల పరిధిలోని బంగ్రంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు పాతపడి నీరు కారుతుడ టంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలో ఆయా పాఠశాలల భవనాల మరమ్మతులకు, ఇతరత్రా పనుల నిమిత్తం నిధులను విడుదల చేస్తోంది. కానీ విద్యాశాఖ అధికారుల అలసత్వం కారణంగా ఈ ఏడాది ఎటువంటి పనులు జరగలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.
శిథిలావస్థలో ప్రాథమిక పాఠశాల..
బంగ్రంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాల పైకప్పు పెచ్చులూ డుతోంది. వర్షాకాలంలో వర్షపు నీరు స్లాబ్‌, గోడల నుంచి రావడంతో భవన నిర్మాణం దెబ్బతింటోంది. అక్కడక్కడ సజ్జలు సైతం పెచ్చులూడుతూ దర్శన మిస్తున్నాయి. చలికాలం, ఎండాకాలం పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉన్నా, వర్షాకాలంలో మాత్రం విద్యార్థులు ఇబ్బందులు పడక తప్పడంలేదు.
పాఠశాలకు ప్రహరీ లేదు…
పాఠశాలకు ప్రహరీ నిర్మాణం లేదు. వెనక భాగాన పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో గత వర్షాకాలంలో పాఠశాల ఆవరణలో పాములు సంచరించాయని గ్రామస్తులు, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పాముల సంచారంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురవు తున్నారు.
బడి…భయపెడుతుంది
పాఠశాలలో వర్షం వస్తే నిలిచిపోతున్న బోధన.. చౌడాపూర్‌ మండలం బంగ్రంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో దయనీయ పరిస్థితి. వర్షాకాలం కావడంతో సర్కారు బడి భవనాలు శిథిలావస్థకు చేరి భయపె డుతున్నాయి. పాఠశాల భవనాలు ఎప్పుడు కులుతా యోనాన్న ఆందోళన నెలకొంది. బిక్కుబిక్కుమంటు ఉపాధ్యాయులు, విద్యార్థులు గడుపుతున్నారు. ఉన్నతా ధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
పట్టించుకోని అధికారులు..
పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ విద్యాశాఖా ధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు విద్యార్థుల ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని ప్రాథమిక పాఠశాల భవనానికి మరమ్మతులు చేపట్టాలి. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల పట్ల వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
చిన్న గ్రామస్తులు

Spread the love