సిడ్నీలో సూపర్‌కింగ్స్‌ అకాడమీ

– సెప్టెంబర్‌ నుంచి కోచింగ్‌ ఆరంభం
చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అత్యంత విజయవంతమైన ప్రాంఛైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో క్రికెట్‌ అకాడమీ ఆరంభించనుంది. ఇప్పటికే రెండు అంతర్జాతీయ సూపర్‌ కింగ్స్‌ అకాడమీలు నడిపిస్తున్న సూపర్‌కింగ్స్‌ యాజమాన్యం కంగారూల దేశంలో మూడోది మొదలుపెట్టనున్నారు. డల్లాస్‌ (యుఎస్‌ఏ), రీడింగ్‌ (బ్రిటన్‌)లో ఇప్పటికే సూపర్‌కింగ్స్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలు విజయవంతంగా నడుస్తున్నాయి. సిడ్నీ ఒలింపిక్‌ పార్క్‌ సమీపంలోని క్రికెట్‌ సెంట్రల్‌లో సూపర్‌ కింగ్స్‌ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ శ్రేణి మౌళిక సదుపాయాలతో ఏర్పాటు కానున్న క్రికెట్‌ అకాడమీలో ఇండోర్‌, అవుట్‌డోర్‌ శిక్షణ ఏడాది పొడవునా కొనసాగనున్నాయి. బాలురు, బాలికలకు ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి క్రికెట్‌ కోచింగ్‌ ఇవ్వనున్నారు.

Spread the love