జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో పుష్కర ఘాట్లను తాకుతూ గోదావరి నది వరద ఉధృతి ప్రవాహం కొనసాగుతోంది. కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదుల కలయికతో వరద ఉధృతి బాగా పెరిగి 103.56 మీటర్లకు వరద ప్రవాహం చేరింది. వరద ప్రవాహం బాగా పెరుగుతున్న దృష్ట్యా సెంట్రల్ వాటర్ కమిషన్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి పెరుగుతున్న దృష్ట్యా సందర్శకులు లోపలికి వెళ్లి స్నానాలు చేయకుండా సూచనలు చేస్తున్నారు. గోదావరి తీర ప్రాంత గ్రామాల ప్రజలు క్రమంగా ఉండాలని ప్రవాహం బాగా పెరిగితే పునరావాస ప్రాంతాలకు ప్రజలు తరలి వెళ్లాలని అధికారులు గ్రామాల్లో దండోరా వేయించారు.