– సింగిల్ విండో చైర్మన్ బాల నర్సయ్య
నవతెలంగాణ – బొమ్మలరామారం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ, రైతులపై లేదని, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని బొమ్మలరామారం మండల సింగిల్ విండో చైర్మన్ బాల్ నర్సయ్య అన్నారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో సోమవారం వారు మాట్లాడుతూ…ఏకకాల రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తానని చెప్పి విడుదల వారిగా ఇవ్వడంతో రైతులు అందరూ అయోమయ స్థితిలో పడ్డారని, బంగారంపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని అన్నారు, సాగు చేసే రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కోoడోజు ఆంజనేయులు, గుండ్లపల్లి వెంకటేష్, మాజీ ఉపసర్పంచ్ జూపల్లి భరత్, భాస్కర్, శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.