ఉపాధ్యాయుల సంక్షేమం పిఆర్టియు తెలంగాణతోనే సాధ్యం

The welfare of teachers is possible only with PRTU Telangana– కుబీర్ మండల నూతన పిఆర్టియు  కార్యవర్గం ఎన్నిక
– అధ్యక్షుడిగా పురంశెట్టి సాయి కుమార్
నవతెలంగాణ – కుభీర్
ఉపాధ్యాయుల హక్కుల సాధన, సంక్షేమం పిఆర్టియు తెలంగాణతో మాత్రమే సాధ్యమవుతుందన్న విశ్వాసాన్ని నిర్మల్ జిల్లా అధ్యక్షులు  యాటకారి సాయన్న వ్యక్తపరిచారు. సోమవారం బైంసా పట్టణంలోని వేదం పాఠశాలలో  జరిగిన ప్రాథమిక  సభ్యుల సమావేశంలో కుబీర్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . అధ్యక్షులుగా పురం శెట్టి సాయికుమార్ పల్సి ప్రధాన కార్యదర్శి గా బాగుల చంద్రశేఖర్  సోనారి   ఉపాధ్యక్షులుగా దాసరి సాయన్న  కుభీర్ అసోసియేట్ అధ్యక్షులు గా భాస్కర్ రెడ్డి పల్సి కార్యదర్శిగా అరుణ్ నాయక్ పార్టీ-బి కోశాధికారిగా చందాల ఎర్రన్న పల్సి నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులుగా హరిహరనాథ్ కుబీర్  లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు ,ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ.గడిచిన 10 సంవత్సరాల కాలంగా ఉపాధ్యాయులు అనేక సమస్యలతో కొట్టుమిట్టడడం జరిగిందన్నారు.
గత పాలకులకు వత్తాసు పలుకుతూ వ్యక్తిగత స్వార్థంతో  కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, కొందరు సంఘ నాయకులు పైరవీలకే పరిమితమై పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతులు కోసం గత 25 సంవత్సరాలుగా  ఎదురు చూడడం జరిగిందన్నారు. ఎట్టకేలకు వారి కల  హర్షవర్ధన్ రెడ్డి చలవతోనే సహకారమైందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.  స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు మరియు ఉపాధ్యాయుల బదిలీలు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు  హర్షవర్ధన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఒప్పించి సాధించడం గర్వకారణంగా ఉందన్నారు . ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి అందుబాటులో ఉంటూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అహర్నిషులుగా శ్రమిస్తున్న ఏకైక ఉపాధ్యాయ సంఘ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి అని కొనియాడారు. గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పిఆర్సి బకాయిల 15 వాయిదాల సొమ్మును ఇటీవల ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ  కావడానికి కృషిచేసిన హర్ష వర్ధన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు .  పెండింగ్ కరువు బత్యాలు త్వరలోనే విడుదలవుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. మెరుగైన ఫిట్మెంట్తో నూతన పిఆర్సి ని సాధిస్తాం అన్న ఆశాభావాన్ని వారు వెలిబుచ్చారు. కార్యవర్గ ఎన్నిక సమావేశంలో  నిర్మల్  ప్రధాన కార్యదర్శ చక్రాల హరిప్రసాద్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సొప్పర్  వార్ శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ, జిల్లా గౌరవాధ్యక్షులు సరికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love