మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి

Problems of municipal workers should be resolved: Bommidi Srinivas Reddyనవతెలంగాణ – భగత్ నగర్
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో   మంగళవారం మున్సిపల్ కమీషనర్ కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ    బి. ఆర్.టి.యు,  సి ఐ టి యు సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి కరీంనగర్ నగరపాలక సంస్థలొ  పనిచేసే కార్మికుల సమస్యలపై సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సానిటేషన్ లో చెత్త సేకరణ చేస్తూన్న  వాహనాల   రిపేర్లు దాదాపుగా రెండు సంవత్సరాల నుండి చేయించకపోవడం తో  వాహనాలు పూర్తిగా చెడిపోయి వాటిని నడపడానికి డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.ఇప్పటికైనా   అధికారులు ఈ సమస్యలపై స్పందించకపోతే  ఆగష్టు నెల ఐదో తేదీ  సోమవారం నుండి అన్ని వెహికల్స్ ను బందు పెట్టి సమ్మెలోకి  వెళ్తామని తెలిపారు. సానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు వాన కాలంలో ఇవ్వవలసిన రైన్ కోట్స్ గత మూడు సంవత్సరాల నుండి ఇవ్వడం లేదని ఈ వర్షాకాలంలో వర్షంలో నానుతూ రోగాల బారిన పడుతున్న కార్మికులను ఆదుకోవాలని వారికి  వెంటనే రైన్ కోట్స్ , బట్టలు ఆఫ్రాన్లు ఒక నెల ఏరియస్ బకాయి డబ్బులు ఇవ్వాలని కోరారు. కార్మికులు చనిపోతే వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు వయసుతో నిమిత్తం లేకుండా  వారి స్థానంలో అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.  ఇప్పటికీ చాలామంది చనిపోయిన వారి కుటుంబ సభ్యులు నియామకం కోసం   నిరీక్షిస్తూ ఉన్న వారిని పట్టించుకోవడంలేదని వెంటనే వారిని నియమించాలని లేనియెడల శానిటేషన్ కార్మికులు కూడా ఆగష్టు  8 వ తారీకు గురువారం నుండి కా సానిటేషన్ విభాగంలో పనిచేసే అన్ని విభాగాల కార్మికులు సమ్మెలోకి వెళ్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, టీఎం డబ్ల్యూ ఈ యు  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగం రాజమల్లు, మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ బిఆర్టియు అధ్యక్షుడు  పొన్నం లింగయ్య, బి ఆర్ టి యు నగర అధ్యక్షుడు గడ్డం సంపత్ టిఎండబ్ల్యూ ఈ యు జిల్లా అధ్యక్షుడు  ఆసోద  రవీందర్ ,బి ఆర్ టి యు డ్రైవర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మాతంగి లక్ష్మణ్, టిఎండబ్ల్యూ ఈ యు కార్పొరేషన్ కమిటీ అధ్యక్షులు దాసరి రాజమల్లయ్య, టిఎండబ్ల్యూ ఈ యు కార్పొరేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి కావంపల్లి రవి, నాయకులు మల్లేశం, సుంకరి లక్ష్మణ్, దావు రమేష్, సుంకరి రమేష్ ,సుంచు హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love