నవతెలంగాణ – కొనరావుపేట
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎఎస్పీ శేషాద్రిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఠాణాలోని పరిసరాలను, రికార్డులను పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలు చేశారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల శాంతియుతంగా నడుస్తూ వారి సమస్యలను పరిష్కారించే విధంగా కృషి చేయాలన్నారు. అనంతరం నిజామాబాద్ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు కాగా విచారణ చేపట్టారు. ఇక్కడ ఎస్ఐ అంజనేయులు, సిబ్బంది ఉన్నారు.