వనమహోత్సవంలో భాగంగా గౌడ కులస్తులు ఈత మొక్కల ను నాటాలని ఎక్సైజ్ ఎస్సై గజేందర్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో వనమహోత్సవంలో భాగంగా ముధోల్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఈత మొక్కలను శనివారం నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాలలో చెరువుగట్లపై , ప్రభుత్వ ఖాళీ భూముల్లో, వాగు ఓడ్డుల పైన మొక్కలను నాటాలని సూచించారు. స్వేచ్ఛమైన కల్లు కోసం ఈత మొక్కలు పెంపకం తప్పనిసరి అన్నారు.ఈకార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గం మోకుదెబ్బ గౌడ సంఘం సెక్రటరీ ఆకుల అంజి గౌడ్ , ఎక్సైజ్ కానిస్టేబుల్ అక్తర్, కృష్ణమోహన్, అశోక్, గౌడ సంఘం సభ్యులు వెంకటేష్ గౌడ్, సాయిబాబా ,దేవగౌడ్, ప్రవీణ్ గౌడ్, పాల్గొన్నారు.