స్వచ్చ దనం – పచ్చదనం పై పలు గ్రామాల్లో ర్యాలీలు

Rallies in many villages on cleanliness and greennessనవతెలంగాణ – లోకేశ్వరం
మండల కేంద్రం తో పాటు రాజుర, మన్మధ్, బిలోలి, ఆర్లి – గోడిసెర గ్రామలలో సోమవారం స్వచ్ఛదనం-పచ్చదనం లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ఐదు రోజులు నిర్వహించే కార్యక్రమాలను చదివి వినిపించారు. అనంతరం గ్రామస్థులతో , విద్యార్థులతో ర్యాలీ చెపట్టి ప్రజలకు సీజనల్ వ్యాదులు ,పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిదులు, అధికారులు అంగన్వాడీ ఉపాధ్యాయురాలు, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Spread the love