పంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని వినతి

Request to make panchayat workers permanentనవతెలంగాణ – పెద్దవూర
పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని సోమవారం ఎంపీడిఓ ఉమాదేవికి  పంచాయతీ కార్మికులు మండలం అధ్యక్షులు పున్ రెడ్డి మంగారెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్‌ 60 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కారోబార్‌ బిల్‌ కలెక్టర్‌ నియమించాలని అన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కు టుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం అందించాల న్నారు. పెండింగ్‌ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మల్టీపర్పస్‌ విధానం రద్దుచేసి పాత విధానం కొనసాగించి కార్మికులను ప్ర భుత్వ ఉద్యోగుల గుర్తించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వూరే ప్రభాకర్, ఉపాధ్యక్షులు మట్టపల్లి అంజిరెడ్డి, ఏసు వినతి పత్రం అంద జేసిన వారిలో ఉన్నారు.
Spread the love