బంగ్లాదేశ్ నుంచి భారతీయుల తరలింపు అవసరం లేదు: కేంద్రం

indianనవతెలంగాణ – ఢిల్లీ
బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. అఖిలపక్ష భేటీలో ఆయన మాట్లాడుతూ.. ఆ దేశంలో ఉన్న భారతీయులను తరలించేంత ప్రమాదకరంగా పరిస్థితులు లేవన్నారు. భవిష్యత్ ప్రణాళికను ఆలోచించుకోవడానికి బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరింత సమయం ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. అక్కడ ఎన్నికలు జరిగే వరకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు.

Spread the love